హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే తీరుపై సర్పంచ్ అసహనం

KNR: ఎరడపల్లి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు, CMRF చెక్కులను ఎమ్మెల్యే డా.కె. సత్యనారాయణ కార్యకర్తలతో లబ్ధిదారులకు పంపిణీ చేయడంపై సర్పంచ్ కొయ్యడ రజిత అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించి, సర్పంచులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ విషయాలుగా మార్చివేస్తున్నారని వాపోయారు.