హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల చొరవ.. తల్లిదండ్రుల వద్దకు బాలిక

WGL: భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ బాలిక మంగళవారం రాత్రి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రాంగణంలో ఒంటరిగా తిరుగుతుండగా SPF సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు గుర్తించారు. వెంటనే మట్టేవాడ పోలీసులకు సమాచారం అందించి బాలికను అప్పగించారు. పోలీసులు వివరాలు సేకరించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా సిబ్బందిని పోలీసులు అభినందించారు.