KMR: ఘన్‌పూర్ గ్రామానికి చెందిన 60 ఏళ్ల భూక్య రేణుక అనే వృద్ధురాలు డిజిటల్ మోసానికి గురయ్యారు. ఆమె పోస్ట్ ఆఫీస్ ఖాతాలో జమ అయిన రూ. 91,101 ఇందిరమ్మ ఇళ్ల నిధులు.. పేటీఎం యాప్ ద్వారా అపరిచిత వ్యక్తుల ఖాతాకు బదిలీ అయ్యాయి. ఖాతాలో ఉన్న డబ్బులు మాయమవ్వడంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
తెలంగాణ
వృద్ధురాలి ఖాతా నుంచి ‘ఇందిరమ్మ’ డబ్బులు స్వాహా


