హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారిపై భారీ కొండచిలువ ప్రత్యక్షం

HNK: కమలాపూర్ డంపింగ్ యార్డ్ సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం భారీ కొండచిలువ కనిపించింది. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. మండలంలోని పంట పొలాల్లో కొండచిలువల సంచారం పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు జంకుతున్నామని వారు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.