హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీ వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమం

నెల్లూరు: కొడవలూరు మండలంలోని గండవరం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. సుమారుగా 23 రోజులుగా స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బుధవారం వేకువజామున విశేష పుష్ప అలంకరణ మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా సాగింది. మహిళా భక్తులు విచ్చేసి హారతులు ఇచ్చారు. నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు.