హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా లో లెవల్‌ వంతెన

NLG: వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామ శివారులో ఉన్న లో లెవల్‌ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రక్షణ దిమ్మలు లేకపోవడంతో వాహనదారులు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు. వెంటనే రక్షణ దిమ్మలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.