హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేదెల దొంగతనం.. నలుగురికి రిమాండ్

BHNG: చౌటుప్పల్‌లో గేదెలను అపహరిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మన్మథ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిబావి వద్ద వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించారు. విచారణలో గేదెల చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి ఒక గేదె,ఆటో, రూ.80 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.