BHNG: ఆత్మకూరు(ఎం) మండలం కామునిగూడెంలో మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. యజమాని కిరణ్‌కు చెందిన ట్రాక్టర్లలో బిక్కేరు వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా డ్రైవర్లు గూడెపురి నాగరాజు, బద్దుల మహేశ్‌లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అక్రమ ఇసుక తరలింపు.. ఇద్దరిపై కేసు నమోదు


