హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు హన్వాడలో పర్యటించనున్న ప్రభుత్వ విప్

MBNR: ప్రభుత్వ విప్ మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ హన్వాడ మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు హన్వాడ మండలం షేక్ పల్లి గ్రామంలో బీటి రోడ్డు నిర్మాణపనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు మహబూబ్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.