హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొర్రెలను కడిగేందుకు వెళ్లి యువకుడు మృతి

MDK: గొర్రెలను కడిగేందుకు వెళ్లిన మాలోత్ నవీన్(23) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. నర్సంపల్లి పెద్దతండాకు చెందిన నవీన్ మంగళవారం గొర్రెలు మేపుతూ కాస్లాపూర్ లింగరెడ్డి కుంటలోకి దిగి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేటకు తరలించారు. ఈ ఘటనతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది.