హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్సీ

MDK: రామాయంపేట కేజీబీవీ, మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాలలను ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య మంగళవారం పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి బోధన తీరు, ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై ఆరా తీశారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.