హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల దుకాణంలో అధికారుల తనిఖీలు

KMM: కామేపల్లి మండలం బర్లగూడెం, గోవింద్రాల గ్రామాల్లో జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య మంగళవారం ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, పంపిణీ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఏఈవోలను, డిజిల్ క్రాప్ బుకింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని డిజిటల్ బుకింగ్ సర్వేయర్లను ఆదేశించారు.