హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRSకు షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

BDK: అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం BRSకు రాజీనామా ప్రకటించారు. పార్టీ తీరుపై అసహనం, అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన రాజీనామాతో అశ్వరావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో చర్చ మొదలైంది. రాజీనామాకు గల పూర్తి కారణాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా BRSకు ఎదురు దెబ్బ అని నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి.