హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేచర్లలో బెల్లపు ఊట ధ్వంసం..!

ELR: చింతలపూడి మండలం రేచర్లలో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బాణావతు పిచ్చెమ్మ అనే మహిళ నాటు సారాయి తయారీ కోసం నిల్వ ఉంచిన 50 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను గుర్తించినట్లు ఎక్సైజ్ CI అశోక్ తెలిపారు. ఆ ఊటను ధ్వంసం చేసి, మహిళపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ Slలు అబ్దుల్ ఖలీల్, జగ్గారావు పాల్గొన్నారు.