MLG: పరిసరాల పరిశుభ్రత, పచ్చదనంపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని తాడ్వాయి సర్పంచి కొటెం ప్రవళిక అన్నారు. మేరా యువ భారత్ ములుగు వాలంటీర్లు, యువజన సంఘాల సభ్యులు మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలో స్వచ్ఛపక్వాడ నిర్వహించారు. పీహెచ్‌సీతో పాటు వీధులను శుభ్రం చేసి, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటారు. యువత స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
పరిశుభ్రతతోనే ఆరోగ్యకర సమాజం


