హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు ఆదేశం'

SRD: సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పాండు ఆదేశించారు. పదికి 351 మంది, ఇంటర్‌కు 691 మంది పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.