NLG: దేవరకొండ మండలం అమ్మటోనిగూడెం వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను అంజయ్య, కోటేశ్ (31)గా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి


