హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కాకినాడ: తుని జాతీయ రహదారిపై డీ-మార్ట్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న బురదలో పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఒకరికి కాలికి గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.