GNTR: ఏపీ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఎన్నికలు ఈ నెల 9న జరుగుతాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారెడ్డి తెలిపారు. అరండల్ పేటలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఎన్నికలు జరుగుతాయని, గౌరవాధ్యక్షులు నరసింహారావు పర్యవేక్షణలో ఎన్నికలను నిర్వహిస్తారన్నారు. ఉదయం 10గంటలకు నామినేషన్, 11:30కు ఓటింగ్, మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
9న జిల్లా గ్రంథాలయ సంస్థ ఎన్నికలు


