హైదరాబాద్: 28°C
తెలంగాణ

6 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్

KMR: జిల్లాలోని జాతీయ రహదారి-44 వెంట టీజీ సేఫ్ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. దీంతో 6 సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేసి, మరో 2 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మెదక్, NZB, KMR జిల్లాల్లో మొత్తం 20 సంస్థలను తనిఖీ చేసి 21 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.