హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి: ఎంపీ

ATP: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం నలుగురు లబ్ధిదారులకు రూ.2,57,421 విలువైన చెక్కులు అందజేశారు. గండంసెట్టి శేషప్పకు రూ.79,847, అమినేని రామదేవికి రూ.85,175, నూతేటి శ్రీధర్‌కు రూ.24,584, డి.రత్నమ్మకు రూ.67,815 చెక్కులను ఇచ్చారు. అర్హులందరికీ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.