NRPT: కోటకొండలో సిరిగి నర్సమ్మ అనే వ్యవసాయ కూలీ మంగళవారం పొలంలో పనిచేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందింది. రోజూ మాదిరిగానే పొలంలో పని చేస్తున్న నర్సమ్మ, విద్యుత్ తీగలను గమనించక ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో మహిళ మృతి


