ASR: పెదబొడ్డేపల్లికి చెందిన గానుగుల సాయి మాణిక్య (24) ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. బీటెక్ చదువుకున్న యువకుడు కొంతకాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని సీఐ తెలిపారు. తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం రాలేదని ఉరి వేసుకుని మృతి


