హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అతిధి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు

అల్లూరి జిల్లాలో 11 ఏకలవ్య గురుకులాల్లో అతిథి ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంతి ఒక ప్రకటనలో తెలిపారు. సిబిఎస్ఇ సిలబస్ బోధనకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో ఈ నెల 8న డుంబ్రిగుడలోని పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 మధ్య హాజరు కావాలన్నారు. 94937 58072, 99085 95435 నంబర్లలో సంప్రదించాలన్నారు.