హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి రవాణా చట్టరీత్యా నేరం: సీలేరు ఎస్సై

ASR: గంజాయి సాగు, రవాణా చేయడం చట్టరీత్యా పెద్ద నేరమని సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తెలిపారు. దుప్పులవాడలో ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలన అయిందని, స్మగ్లర్లు డబ్బు ఆశ చూపి గిరిజన యువతను రవాణాకు వాడుకుంటున్నారని చెప్పారు. యువత ప్రలోభాలకు గురై జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు.