హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడేళ్లుగా వేతనాలు పెరగలేదు.. ఎమ్మెల్యే వేగుళ్లకు వినతి

కోనసీమ: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు వారు వినతిపత్రం అందజేశారు. ఆశా వర్కర్లు జి. దుర్గ, ఎస్. విజయ, బేబీ, నాగమణి మాట్లాడుతూ.. ఏడేళ్లుగా వేతనాలు పెరగకపోవడంతో పెరుగుతున్న ధరల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.