హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేబుల్ గుంతలను పూడ్చండి సారూ..!

కృష్ణా: కోడూరు మండలంలో ఎయిర్టెల్ కంపెనీ వారు కేబుల్ కోసం మందపాకల, లింగారెడ్డి పాలెం, నక్కవాణిదారి ప్రాంతాల్లో రోడ్డు పక్కన లోతైన గుంతలు తవ్వి వదిలేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతలు పూడ్చకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారంటున్నారు. వర్షం పడినప్పుడు మట్టి రోడ్డుపైకి వచ్చి వాహనాలు స్లిప్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.