హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిలిండర్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

SRCL: తంగళ్లపల్లి, పద్మానగర్‌, మండపల్లి గ్రామాల్లో గ్యాస్‌ సిలిండర్ల చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిరిసిల్ల రూరల్‌ సీఐ కె. నాగేశ్వరరావు నిందుల పేర్లను తంగళ్లపల్లికి చెందిన కుల్ల ప్రదీప్‌, మండపల్లికి చెందిన చిలుక రఘుపతిలుగా వెల్లడించారు. 3 నెలలుగా రాత్రివేళల్లో రెక్కీ చేసి 22 సిలిండర్లు చోరీ చేసినట్లు వెల్లడైందన్నారు.