హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొర్రెల కాపరిపై కొడవలితో దాడి..!

KDP: ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో కుక్క మొరిగిందన్న చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెన్నా నది తీరంలో గొర్రెలు మేపుతున్న రాజశేఖర్‌పై సుబ్బారెడ్డి, కిరణ్‌రెడ్డి కొడవలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.