హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసులో నిందితుడి అరెస్ట్: రూరల్ SHO

NZB: రూరల్ PS పరిధిలోని ఖానాపూర్లో సంగం లింగం (57) హత్య కేసులో నిందితుడు అల్లకొండ గంగాధాస్ (36)ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు రూరల్ SHOశ్రీధర్ రెడ్డి తెలిపారు. మృతుడు నిందితుడి వద్ద తాకట్టు పెట్టిన TVS XL వాహనాన్ని తెలియకుండా తీసుకెళ్లి డబ్బులు ఇవ్వలేదని, ఈ క్రమంలో గత 30న రాత్రి నిందితుడు మృతుడి ఇంటికి వెళ్లి గొడవపడి, హత్య చేశాడని తెలిపారు.