హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థిలను చితకబాదిన కొట్టిన టీచర్ సస్పెండ్

WGL: నెక్కొండ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్(బాలికలు)లో 5వ తరగతి విద్యార్థులను ఇంగ్లీష్ టీచర్ రజిని బెత్తంతో కొట్టినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై కలెక్టర్ సత్య శారద సుమోటోగా స్పందించారు. ప్రాథమిక విచారణకు MPDOను నియమించగా, నివేదిక ఆధారంగా ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. విద్యార్థులపై వేధింపులు, శారీరక దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, కలెక్టర్ స్పష్టం చేశారు.