హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే

NRML: కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, డయాలసిస్ సెంటర్ పునరుద్ధరణ, ఇచ్చోడలో 30 పడకల సీహెచ్‌సీ మంజూరు చేయాలని కోరారు. నేరడిగొండ, బజార్‌హత్నూర్ మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించాలన్నారు.