E.G: నిడదవోలులో దసరా పందిరి రాట నిడదవోలు 19వ వార్డులో సోమవారం దసరా మహోత్సవాల్లో భాగంగా పందిరి రాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా దసరాను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, కమిటీ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిడదవోలు దసరా ఉత్సవాలకు శ్రీకారం


