హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు ప్రమాదం.. 22 మంది సేఫ్

KRNL: సోమయాజులపల్లె వద్ద యూటర్న్ తీసుకుంటున్న ఓవర్‌లోడ్ లారీ ప్రైవేట్ బస్సును ఢీకొని బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, బస్సులోని 22 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.