హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన ఇర్ఫానీ దర్గా ఉర్సు.. ప్రార్థనల్లో జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి ఇర్ఫానీ దర్గా 24వ ఉర్సు ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరి రోజు కార్యక్రమానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరై చాదర్ సమర్పించి, ప్రత్యేక దువా చేశారు. దర్గాలు కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని, ఐక్యతను చాటుతాయని ఆయన పేర్కొన్నారు. ఖవ్వాలీ అలరించగా, పాల్గొన్న కళాకారులకు కానుకలు అందించారు. నాయకులు, భక్తులు పాల్గొన్నారు.