హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంభంపాడులో పోలీసులు కార్డాన్ సెర్చ్

పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కంభంపాడులో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో అణువణువునా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని, పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు వాహన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు.