హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వడ్డీ వ్యాపారి బాబి మృతి కేసులో కీలక మలుపు

WG: మొగల్తూరులో వడ్డీ వ్యాపారి గ్రంధి బాబి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాబిది సహజ మరణం కాదని, నలుగురు వ్యక్తులు హత్య చేసి బంగారం, వెండి అపహరించారని ఆయన కుమారుడు పవన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కేసు విచారణలో బాబి హత్యకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బంగారం, వెండి, నగదు, పద్దుల పుస్తకం మాయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.