హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌటల మండలంలో గొడ్డలితో దాడికి యత్నం

ASF: కౌటాల మండలం ముత్తంపేట సర్పంచ్ రాంటెంకి ఉష భర్త మోతిరాంపై మల్టీపర్పస్ వర్కర్ దుర్గం బండు దాడికి యత్నించినట్లు బాధితుడు తెలిపారు. ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీటి లీకేజీ సరిచేయాలని చెప్పడంతో కోపం పెంచుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం బండును పిలిపించగా గొడ్డలితో వచ్చి దాడికి యత్నించాడని, స్థానికులు అడ్డుకున్నారని తెలిపారు.