కర్నూలు నగరంలో శుభకార్యాల సందర్భంగా షామియానాలు, పందిళ్ల ఏర్పాటుకు రహదారులకు నష్టం కలగకుండా కాంక్రీట్ స్టాండ్లను మాత్రమే వినియోగించాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. రోడ్లపై గుంతలు తవ్వడం, మేకులు కొట్టడం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం-1994 ప్రకారం జరిమానాలు విధిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రోడ్లపై గుంతలు తవ్వితే చర్యలు తప్పవు'


