హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దోమల బెడదను నివారించండి'

BHNG: దోమల బెడదతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  ప్రతీ 15 రోజులకోసారి ఫాగింగ్ నిర్వహించాల్సి ఉండగా.. నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. చాలా గ్రామాల్లో ఫాగింగ్ యంత్రాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. ఫాగింగ్ యంత్రాలకు మరమ్మతులు చేయించి, నివారణ చర్యలు వేగవంతం చేయాలని గ్రామీణులు విజ్ఞప్తి చేస్తున్నారు.