BHPL: గోరికొత్తపల్లి మండలంలోని అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని BRS మండల యూత్ ఉపాధ్యక్షుడు అక్కల రాహుల్ సూచించారు. పాత ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. కొత్తగా అర్హత పొందిన పట్టభద్రులు నిర్ణీత గడువులోగా ఓటు నమోదు చేసుకుని హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: రాహుల్


