హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుగ్గారం నూతన ఎస్సైగా శ్రీకాంత్ బాధ్యతలు

JGL: బుగ్గారం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ఎస్. శ్రీకాంత్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. రౌడీయిజం, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని కోరారు.