హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

13 చోట్ల ఎన్నికలు వాయిదా

మార్కాపురం జిల్లాలో కోరం లేక 13 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 29న జిల్లాలోని 1,385 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించగా, కోరం లేక 39 చోట్ల వాయిదా పడ్డాయి. శనివారం ఆయా పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించగా 13 చోట్ల మళ్లీ వాయిదా పడ్డాయి. వీటిలో అత్యధికంగా వై.పాలెంలో ఏడు పాఠశాలలు ఉన్నాయి.