హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

కర్నూలు కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు అక్టోబర్ 6న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎం.ఏలో 55 శాతం మార్కులతో పాటు నెట్/సెట్/పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రిన్సిపల్ డా. ఎం.భారతి తెలిపారు. అర్హులు ఉదయం 11 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.