హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా ఇసుక తరలింపు ..కేసు నమోదు

WNP: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పెట్రోలింగ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. రేవల్లి మండలం కేశంపేట పాత తాండ గ్రామానికి చెందిన సంజీవ్ ట్రాక్టర్ (TS32T6967)లో ఇసుక‌ను తరలిస్తుండగా కేశంపేట గ్రామం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ రజిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.