హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగరకొండ ఈవో సస్పెన్షన్

BPT: అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఈవో తిమ్మనాయుడిని సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోపై వచ్చిన వివిధ రకాల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం స్టేట్ ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ సింగరకొండలో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.