హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వంపై ఎంపీ విమర్శలు

అన్నమయ్య: గాలివీడులో వైసీపీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. గండికోట–వెలిగల్లు ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇళ్లు, మహిళలకు రూ.1,500, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు.