హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు మాజీ సీఎం నల్లారి రాక

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ CM నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఇవాళ కలికిరికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు కలికిరిలోని తన నివాసానికి చేరుకుంటారు. 5, 6 తేదీల్లో కలికిరి బీజేపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉంటారని వ్యక్తిగత కార్యదర్శి తెలిపారు.