హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం దుకాణాల టెండర్లకు రేపే చివరి రోజు

కడప జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తుల గడువు రేపు అర్ధరాత్రితో ముగియనుందని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. అక్టోబర్ 7న దరఖాస్తుల పరిశీలన, 8న కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్ సీఐలను సంప్రదించాలన్నారు.