హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలుషిత నీరు తాగి 12 మంది అస్వస్థత

కృష్ణా: జగ్గయ్యపేట సమీపంలోని తెలంగాణ సరిహద్దు గ్రామం అప్పల నర్సాపురంలోని భద్రాద్రి ఐరన్‌ ఓర్‌ ఫ్యాక్టరీలో కలుషిత నీరు తాగి 12 మంది అస్వస్థతకు గురయ్యారు. తాగునీటి వాటర్ ట్యాంకులో బల్లి పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. వాంతులు, తలనొప్పితో బాధపడుతున్న వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు బీహార్‌కు చెందిన కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.